తెలుగు టపాదారులు అందరికి నమస్కారం. నా గురించి చిన్న పరిచయం. మీరు అందరు హై స్కులు దాటి వచ్చారు అంటే నా గురించి అందరు విని, చదివి, రాసే ఉంటారు. హిస్టొరీ పుస్తకంలో నెను ఒక సామ్రాట్టుని. చెట్టులు నాటించాను, కాలువలు తవ్వించాను అని పేజీలు పేజీలు రాసేసి చించేసి ఉంటారు. ఈ పాటికి నా పేరు వివరలు మీకు స్పూరించే ఉంటాయి. ఒకసారి భూలోకం వెళ్ళి నా చెట్టులు, కాలువలు ఏలా ఉన్నయో చూసి వస్తాను అని బ్రహ్మ దేవుడికి కాగితం పెట్టుకున్నా. ఫ్లేసెమెంట్ లొ పొరపాటొ, లేకపొతె ఆ కాగితంలొ బ్రహ్మ గారి పేరు తప్పు పలికానొ తెలీదు కాని నాను మాత్రం బెంగళూరు మహానగరంలొ “బ్రహ్మి” గా పడెసారు. కాని పేరు మాత్రం అదే ఉంచుకోమన్నాడు. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచినప్పుడు అనుకుంత నా చక్రం ని నాకు అందకుండా జెండా లొ పెట్టేసారు, పొనీలె అనుకుంటే నా స్తంభాన్ని కూద లాగేసుకుని, దానికి ఒక రబ్బరు స్టాంప్ కి పెట్టెసారు. ఇదేమి అన్యాయం అని అడిగిన ప్రతి వాడినీ దానితొ గుద్దుతూ వచ్చారు. నా చెట్లని, కాలువలని మాత్రం మర్చిపొయారు.
వచ్చిన పని చూడకుండ ఇలా బ్రహ్మి గా ఉన్నాను అని పైన ప్లేసెమెంట్ ఆఫిసర్ గారికి కోపం వచినట్టు ఉంది. మొన్న పడుకున్నప్పుడు నెత్తి మీద రెండు పీకి రేయ్ అని లేపి నువ్వు వచ్చిన పని ఏంటి పీకుతొంది ఏంటి అని ఒక చిన్న గీతొపదేశం లాంటిది చేసాడు. ఇన్నాళ్ళు గుర్తు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా అంటే బ్రహ్మి లు అందరూ ఉరికే తిని, తొంగుంటారు అని ప్లేసెమెంట్ ఆఫిస్ లో ఎవడో ఈయనకి చెప్పాడంట, నిజమా కాదా అని మన సార్ గారు కళ్ళు మూసుకుని చూసే టైం కి రాజా వారు హైదరాబాది బిర్యాని తింటూ కనిపించారంట. అదిగో అప్పుడు మొదలైన మంట నన్ను రెండు పీకే వరకు చల్లారలేదంట. కాలువలు అని చెట్లు అని సొల్లు కబుర్లు చెప్పి ఇక్కదికి వచ్చి బిర్యాని తింటూ కూర్చుంటావా? అని అడిగాడు. జవాబు చెప్పెలోపె గొంతెత్తి రేపటి లోగా నేను వచ్చిన పని మీద రిపొర్ట్ కావాలి అన్నాడు.
అసలే టైం తక్కువ ఉంది అని దేశం ఎలా ఉందో చూద్దాం అని బయలుదేరాను, నా ఇంటి పక్కన ఉన్న సిగ్నల్ దాటడనికే మధ్యహ్నం అయ్యింది. బెంగళూరు మహా నగరం కి ఒక ప్రత్యేకత ఉంది. ట్రాఫిక్ కదిలేప్పటికన్నా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు హర్న్ ని ఎక్కువగా వాడుతుంటారు. సిగ్నల్ కి కిలొమీటర్ దూరంలొ ఉన్న సరే పచ్చ లైట్ కనపడగానె పుయ్ పుయ్ అంటుంటారు. నేను మార్గదర్శి లొ చేరాను, ఒక హర్న్ కొనుక్కున్నాను అని చెప్పడానికి ఏమో నాకు అర్ధం కాదు.ఇది ఒక ఆటోలకి, క్యాబ్ లకి కాదు అందరిది ఇదే పద్దతి, హర్న్ కి కూడ ఒక మీటర్ పెట్టి ఎన్నిసార్లు వాడితే అంత డబ్బు ప్రభుత్వానికి కట్టే పద్దతి ఎదన్నా ఉంటే బాగుండేది.ఇలా ఐతె పని అవ్వదు అనుకుని ఇంటికి నడిచి వచ్చెసాను. ఎం చెయ్యాలి రా దేవుడా అనుకుంటె చంద్రముఖి సినిమా లొ రజిని వచ్చి “చింతించకు మిత్రమా..ఈ ఈశ్వర్ వచ్చెసాడు” అన్నట్టు నాకు గూగుల్ గుర్తొచ్చింది.న్యూటన్ మహాశయుడు పుట్టకపోయీనా ప్రపంచం ముందుకి వెళ్ళేది ఎమో కాని గూగుల్ లేకపొతే ఎం అయ్యెదో.ఆలొచిస్తేనే భయం వేస్తుంది.కొన్నాళ్లు ఆగితే తప్పిపొయిన మనుషులని, వస్తువులని కూడ గూగుల్ లొ వెతుక్కొవాలి ఏమో.మనందరికి మామూలుగా సినిమాలు అంటే పిచ్చి, ఇది ఎన్నికల కాలం కాబట్టి టైంపాస్ కి మాంచి సాధనం. వీటి గురించే నేను ఇప్పుడు తర్కించేది.
ఎన్నికల గురించి పేపర్ లో కాని, టివి లో కాని, రోడ్ మీద కాని ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే మాట. ఎవడి తర్కం వాడు వాడేసి వేరె వాడిని యెదవ అనటం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో ఇధి కూడ అంతే. దీనికి ఎవరు మినహాయింపు కాదు. ప్రధనమంత్రి అభ్యర్ధుల దగ్గర నుంచి నెత్తి మీద పావళ కి పనికి రాని వాది వరకూ ఇదే తంతు. చివరికి చెసేది ఎంటి అంటే ఉన్న యెదవలలో ఒక యెదవని ఎన్నుకోడం, మర్నాటి నుంచి వాడిని మళ్ళీ యెదవ యెదవా అనటం. కాదంటారా ? 2-3 సార్లు అస్సెంబ్లీ కో. పార్లమెంట్ కో ఎన్నిక అయ్యె వాళ్ళనే మనం యెదవలు అంటే, స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ళ నుంచీ ఇలాంటి యెదవలనే మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్న మన ప్రజలని ఏమని సంభొధించాలి ? వినడానికి కటువుగా ఉన్న మనం పెద్ద యెదవలం అని ఒప్పుకోక తప్పదు.లోక్ సత్తా జేపి రాజకీయాలలోకి రావడం ఒక విధంగా మంచిదే. ఇన్నాళ్ళూ కుళ్ళు రాజకీయం అని మిన్నకుండిపొయిన వారికి ఆయన ఆదర్శం కాగలడు. కాని మందు బాటిళ్ళకి, చీరలకి, డబ్బులకి వగైర వగైర కి అలవాటు పడిన మన ఓటరు జేపికి, ఆయన పార్టీ కి ఓటు వేస్తాడా అనేది అనుమానమే.ప్రజా రాజ్యం ఇంకో కొత్త మెరుపు. వెండి తెర తళుకు బెలుకుళ నుంచి బైటికి వచ్చి సామజిక న్యాయం అంటున్న చిరంజీవి &కొ కి రాజకీయ అనుభవం బొత్తిగా లేదు. ఇది చాలనట్టు పార్టి అంతర్గత వ్యవహారాలు ఈమధ్య రచ్చకెక్కి పరువు తీస్తున్నయి. ఒక పక్క తల పండిన కాంగ్రేస్, టిడిపిలతొ పొటి గా ప్రచారం, పార్టి వ్యవహారాలు మెగా స్టార్ కి పెద్ద సమస్యే. వీటన్నిటిని దాటుకుని ఓటరుని ఎంత వరకు ప్రభావితం చెయ్యగలడు అనెది ఇంకో పెద్ద ప్రశ్న.ఇంక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణ వాదం వైస్ కి పెద్ద తలనొప్పి ఐపొయింది. పక్కనె డిఎస్ కాచుకుని ఉన్నాడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు సీట్ లొ ఖర్ఛెఫ్ వేసెద్దమా అని. లాస్ట్ టైం ట్రై చేసాడు కాని వైస్ పాద యాత్ర వల్ల కుదరలేదు. తన సైజ్ కి నడవడం కష్టం అనుకున్నాడు ఎమో మొన్నామధ్య బస్సు యాత్ర లాటిది చేసాడు. పెద్దగా లాభం లేదు అనుకున్నడో, వైస్ ఉండగా తన పంతం నెగ్గదు అనుకున్నాడో కాని ఉన్న పలాన తెలంగాణ అందుకున్నడు. ఆంధ్ర రాష్ట్రానికి సియం అవుతాను అనుకున్నవాడు కాస్తా తెలంగాణతొ సరిపెట్టుకుందాం అనుకున్నడు కాబోలు. మేడం గారు ఆ పప్పులు కూడ ఉడకనివ్వ లేదు.అసలే రామోజి రావ్ తొ గొడవేసుకుని తల పట్టుకున్న వైస్ కి ఇది ఇంకొ పెద్ద సమస్యే మరి. పార్టి లొ ఆసమ్మతి, ఈనాడుతొ గడవ ఆనక తనయుని గురించి పేపర్ లొ రొజుకో కొత్త విషయం, సెజ్ సెగ వీటన్నిటిని చూసి ఓటరు డబ్బులు తీసుకున్నా వెస్తాడొ లేదో వెచి చూడాలి.ఇంక సైకిల్ ఎక్కితే దేవేందర్ లాంటి నమ్మిన వాడు వెళ్ళిపొవడం బాబుకి పెద్ద కిక్కే. ఆ కంగారులొ తెలంగాన కి సై అన్నాడు తప్ప ఆలొచించి తీసుకున్న నిర్నయం కాదు అని నా అభిప్రాయం. తళుకు బెళుకుళని రంగంలొకి దింపడం దానిని కొంచెం కవర్ చెయ్యడానికి ఎమో అనిపించక మానదు.ఇక మిగిలిన పెద్ద సంకటం గులాబి రంగు. అసలు ఆ పార్టి ని స్తాపించిన వాళ్ళకి సమర్ధిస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న. మంత్రి పదవి ఇవ్వలేదు అని తెలిసె వరకు గుర్తు రాని తెలంగాణ వాదం అంత అకస్మాత్తు గా ఎలా గుర్తు వచ్చింది? వేరె రాష్ట్రం వచ్చాక పదవీ త్యాగం చేస్తాను అని డబ్బా కబుర్లు కంటే, తెలంగాణా కొసం అంత నిబద్దత ఉంటే ఆ పదవీ త్యాగం ఎదో ఇప్పుడె చేసి పోరాటం చేయొచ్చుగా. అసలు ప్రజలు తెలంగాణ ఇవ్వలా వద్ద అనె విషయం పక్కన పెట్టి దాని కోసం పోరాటం చెసినట్టు నటిస్తున్న నాయకులని గురించి వాళ్ళ నిబద్దత గురించి ఆలొచిస్తే మంచిది. అసలు వెరు రాష్ట్రం అనేది ఒక ఐడెంటిటి కొసం అయ్యి ఉండాలి కాని ఇలా పదవుల కోసం మాత్రం ఖచ్చిత్తం గా కాదు.ఇలాంటి మేలిమి రకాల సమ్మెళనం మహా కూటమి. ఒక్కొక్కరికి గా చెప్తుంటేనె చేంతాడు అయ్యింది ఇంక మొత్తంగా చెప్తే భారతం అవ్తుంది. ఇంత గందరగొళం లొ ఓటరు ఒక స్పష్ట మైన తీర్పు ఇస్తాడా అనేది అనుమానమే. సంకీర్నమే కాని వస్తే ఎన్నాళ్ళు ఉంటుందో ఎవడికి తెలుసు? ఇప్పుడిప్పుడే నిద్ర లేస్తున్న ఓటరు ఈ మాయ నుంచి బైటికి వచ్చి తనకి, దేశానికి మంచి జరిగేలా అలొచించి ఓటెసి గెలిపించెది ఎప్పుడొ మరి?
nuvvu keka ra … ee samakalina kullu rajakiyala gurinchi baa rasav .. thaggakunda kummeyi anthe nee next blogs..
nee modati tapa bagundi maanava..
ee kullu kutantra raajakiyala gurinchi baaga vishleshinchav…
Nee ee kalam (keyboardu) nunchi marinni pratulu raavalani aasistu…
Vamsi