సినిమా ఒక ప్రెక్షకుడికి కి ఆహ్లాదం ఒక కళాకారుడి తపస్సు. ఇంకా చెప్పాలి అంటే కళా రంగం అని చెప్పాలి. కళ ని కళలా చుసినంత కాలం బాగానే ఉంది. అంటే నాటకాలు, బుర్ర కధలు, జానపద ఆటలు-పాటలు ఉన్నప్పుడు. ఎప్పుడైతె కళకి వ్యాపారం కలిసిందొ, అంటే ఎప్పుడైతె సినిమా పుట్టిందొ అప్పటి నుంచి కళకి, కళాకారుడుకి ఉన్న విలువ తగ్గడం మొదలైంది.కారణం కళ కన్న ధన లాభం కొసం ఎగబడటమె.పాత తరం చిత్రాలని అప్పటి నటులని ఎత్తి చూపే ధైర్యం మనకి లేదు.నా ఎడుపు అంతా ఈనాడు తెర మీద తెర వెనక ఉండేవాళ్ళని చూసి విపరీతంగా ఫాలో అయ్యె మన అభిమానగణం గురించే.తీసేవాళ్ళు చుసేవాళ్ళకి కి నచ్చేట్టు తీస్తున్నరు. వాళ్ళకి విలువల కన్నా వ్యాపారం ముఖ్యం కాబట్టి. కాని చూసే వాడు, అదే ప్రేక్షకుడు సినిమాని ఒక వినోద సాధనంలా చుడలేకపొవడమెకారణం మనం మన జీవితంలొ చెయ్యలేని వాటిని, అందని వాటిని తెర మీద చూడొచ్చు కాబట్టి. తెర మీద హిరొ, హిరొయిన్లు ఆడుతుంటే, అక్కడ మనల్ని చూసుకోవచ్చు కాబటి. కాని ఇలా చూసుకొవడం, ఊహించికొవడమే కొంప ముంచెలా ఉంది.
పదో తరగతి తప్పిన వాడికి సిగరెట్ కాల్చాలని , ఇంటర్ తప్పిన వాడికి మందు కొట్టాలనే సూత్రన్ని అష్టదిషలా వ్యాపింపచేసాయి మన సినిమాలు. నిత్య జీవితంలొ సినిమాల ప్రభవానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదేమొ. ఇది ఒకపట్టి మాట, ఇప్పుడు కాలం మారింది, దానికి తగట్టె సినిమాలు మారాయి. సినిమాలతొ పాటు ప్రేక్షకుడు మారాడు.ఒకవేళ ప్రెక్షకుడి కొసమే సినిమాలు మారాయేమొ.ఎవరు మారినా దెబ్బ మాత్రం సమాజం మీద, దాని నైతిక విలువల మీదా పడుతుంది. ఇష్టపడి మరీ కొట్టించుకుంటున్న దెబ్బలు ఇవి. మలేరియా లాగ కొట్టిన కొద్ది ముదురుతుంది ఇది.ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యిన సినిమాలని ఒకసారి పరికిస్తే విషయం కొంచెం బొధ పడొచ్చు.
బొమ్మరిల్లు, హ్యపి డేస్,కొత్త బంగారు లొకం లాంటి సినిమాలని రెండు మూడు సార్లు చూసి పెద్ద హిట్ చేసాం. మన గతాలని గుర్తు తెచ్చుకుని కాసేపు బాధ పడ్డం కాసేపు నవ్వుకున్నాం, తర్వాత మర్చిపొయి ఉంటాం. జీవితంలొ ఒక స్టేజ్ దాటి వచ్చిన వారికి గతం ఒక మధుర జ్ఞాపకం అంటారు. అల అనుకుంటే పైన చెప్పిన సినిమాలు కొందరికి కాసేపు వారి గతాన్ని గుర్తు చెస్తాయి. కాని నాయకా నాయికల వయసులో ఉన్న వాళ్లు ఎలా రియాక్ట్ అవ్వొచ్చొ కొంచం అలొచిస్తే ? నాకు తెలిసి ఒక సినిమాని చూసిన వాళ్ళు మూడు రకాలు. ఒకటి యువతరం వీళ్ళు చేతులు కాలే వరకు ఎవరి మాట వినరు. ఈ తరం సినిమాలకి జవజీవలు పొసెది ఈతరమే. మూడో రకం ముసలితరం. వీరికి మంచి చెద్ద మధ్య తేడ తెలుసు, అన్ని చెప్తారు కాని వినే ప్రయత్నం కాని అర్ధం చేసుకునే ప్రయత్నం కాని ఎవ్వరు చెయ్యరు. వాళ్ళు వేసిన తప్పతడుగులు వేరె వాళ్ళు వెయ్యకుండా చెద్దామనే ప్రయత్నం లా అనిపిస్తుంది. వీళ్లకి సినిమా ఒక గత జ్ఞాపకం లెదా ఒక వ్రుధా ప్రయాస. ఇక మిగిలింది రెండో రకం. వీళ్ళు పై రెండు రకాలకి మధ్యలొ ఉంటారు. వీళ్ళు సినిమా చూసి మనం కూద ఇలా చేసి వుంటే మన జీవితం వేరే విధంగ ఉండేది కదా అనుకుంటారు. చివరి రెండు రకాల వల్లా పెద్ద ఇబ్బంది లెదు. ఉన్నదల్లా మొదటి రకంతోనే. సినిమాని చూసి జీవితాన్ని భవిష్యత్తుని నిర్దేశించుకుంటారు. తెలియని తనం, తెలుసుకొలేని అయోమయం వీళ్ళ బలహీనత. అందరిలోను గొప్పగా డిఫరెంట్ గా ఉండాలనే తపన. ఇలా గొప్పగా డిఫరెంట్ గా ఉండాలనుకునే వాళ్ళ సాతం ఎక్కువ అయిపొవడం వల్లె ఈచిక్కంతా.వరుణ్ గాంధికి మైక్ దొరికినట్టు ఈతరానికి ఇంటర్నెట్ ఒకటి దొరికింది. దీని గురించి దాని లీలల గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు కొత్త విషయాలు తెలుసుకొవలి అంటే ఎవరన్న పెద్దవాళ్ళు చెప్పాలి లేదా పెద్దవాళ్ళ దగ్గర విన్నవాడు చెప్పాలి. ఈ పద్దతి వల్ల మంచి చెడ్డలు రెండు తెలిసేవి. కాని ఇప్పుడు చూసె వాడి వయసుకి వాడి వివెకానికి సంబంధం లెకుండ అన్ని నెట్ లొ ఉంటున్నాయి. మాములుగానె మనిషికి చెడు అంతె ఇష్టం, మంచి కంటె చెడు వైపే మొగ్గుతాడు. కాని ఈ కాలంలో మెదడు కన్నా ముందె మనిషి పరుగెత్తే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్ననికి ఇది వరకు సినిమా ఇప్పుడు ఇంటెర్నెట్ తమ వంతు అమూల్యమైన సహయన్ని అందిస్తున్నాయి.మొత్తాన్ని చెప్తే… తరానికి తరానికి మధ్య అంతరం పెరుగుతుంది. పెరిగే కొద్ది అది పెరిగే స్పీడ్ కూడ పెరుగుతుంది. దీనికి సినిమా, ఇంటెర్నెట్ ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటి యువతరానికి అన్ని విషయాలు తెలుసు కాని అర్ధం చెసుకునె వయసు కాని బుద్ది కుసలత కాని లేదు. అది రావలంటే అనుభవం, వయసు రావాలి. అవి వచ్చెసరికి పున్య కాలం కాస్త గడిచిపొతే? జీవిత గమనన్ని నిర్దేశించే ఈ వయసులొ తప్పటడుగులు వేస్తె ?